Pak Pace Legend Claims He Warned Hardik Pandya | Oneindia Telugu

2021-12-12 329

Shoaib Akhtar opens up on meeting Pandya in 2018 Asia Cup, reveals he warned Indian all-rounder Hardik Pandya
#HardikPandya
#ShoaibAkthar
#Bumrah
#Teamindia

వెన్నెముక గాయం గురించి టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ముందే హెచ్చరించానని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. తాను అలా చెప్పిన కాసేపటికే అతను గాయపడ్డాడని గుర్తు చేసుకున్నాడు. 2018 ఆసియా కప్ సందర్భంగా తొలిసారి వెన్నుగాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, ఆ గాయం నుంచి కోలుకున్నాక కూడా అతను పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేకపోయాడు. దాంతో అతని కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది.